Saturday, June 13, 2026
Homeసినిమా'ఆదిపురుష్‌' ఇంటర్వెల్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్

‘ఆదిపురుష్‌’ ఇంటర్వెల్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్‌’…  ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందుతోంది. రాముడు గెటప్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తూ వచ్చారు. తీరా టీజర్ అంచనాలను అందుకోలేకపోవడంతో  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మళ్లీ స్టార్ట్ చేశారు మేకర్స్.

అయితే.. జనవరి 12న విడుదల కావాల్సిన ఆదిపురుష్ మూవీని జూన్ 16న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. జూన్ 16 కూడా విడుదల కాదంటూ జరిగిన ప్రచారాన్ని ఖండించేలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 16న రావడం పక్కా అని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆదిపురుష్ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఏంటంటే.. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ప్రభాస్ రాక్షసులపై చేసే యుద్ధం సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తోందట.

సముద్రంలో జరిగే ఈ యుద్ధం విజువల్స్ ప్రేక్షకులకు 3డి లో అద్భుతమైన అనుభూతిని ఇస్తాయట. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్‌ చాలా సవాళ్లను ఫేస్‌ చేశాడు. రాముడి పాత్రలో కనిపించడానికి ప్రభాస్‌ చాలా రకాలుగా కష్టపడ్డారు. ముఖ్యంగా విలువిద్యలో శిక్షణ కూడా తీసుకున్నారు.  ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషం. సమ్మర్ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఆదిపురుష్ మూవీతో ఎంత వరకు మెప్పిస్తాడనేది ఆసక్తిగా మారింది.

Also Read : చెప్పిన టైమ్ కే వస్తానంటున్నఆదిపురుష్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular