Sunday, June 14, 2026
HomeTrending Newsమునుగోడు మాదే: కిషన్ రెడ్డి ధీమా

మునుగోడు మాదే: కిషన్ రెడ్డి ధీమా

అవినీతి, అహంకారపూరిత టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నేడు చుండూరులో  మునుగోడు బిజెపి అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, వివేక్ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రులను దించినా, ఎమ్మెల్యేలు, మద్యం బాటిళ్ళు, డబ్బు సంచులు దింపినా, పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టినా…  గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

తాము వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం లేదని, కానీ ప్రజలే కేసిఆర్ అవినీతి కుంభకోణాలకు మీటర్లు పెట్టారని వ్యాఖ్యానించారు. కచ్చితంగా ప్రజలు బిజెపిని మునుగోడులో గెలిపిస్తారని చెప్పారు.

Also Read : మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular