సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు రేపు ఉత్తర ప్రదేశ్ లోని ఆయన స్వగ్రామం సయ్ ఫాయ్ గ్రామంలో జరగనున్నాయి. యూపీ ప్రభుత్వ అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది.  రేపు జరిగే తుది వీడ్కోలు కార్యక్రమానికి జాతీయ నేతలతో పాటు పలు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు,  సీనియర్ నేతలు హాజరై నేతాజీ కి శ్రద్ధాంజలి ఘటించనున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు… ములాయం మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశానికి, బడుగు-బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ములాయం తో వివిధ సందర్భాల్లో కులుసుకున్న ఫోటోలను ప్రధాని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ… అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన నేత ములాయం అని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ఎంతో బాధ్యతగా మెలిగే వారని కొనియాడారు.

గుర్ గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో ఉన్న ములాయం భౌతిక కాయానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ములాయం కుమారుడు అఖిలేష్ ను ఓదార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *