Friday, June 12, 2026
HomeTrending Newsరేపు ములాయం అంత్యక్రియలు: హాజరు కానున్న కేసిఆర్

రేపు ములాయం అంత్యక్రియలు: హాజరు కానున్న కేసిఆర్

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.  ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం అన్నారు.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా, ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు రేపు ఉత్తరప్రదేశ్ లోని ఆయన స్వగ్రామం సాయ్ ఫాయ్ గ్రామంలో జరగనున్నాయి.  సిఎం కేసిఆర్ రేపు జరిగే అంత్యక్రియల్లో పాల్గొన బోతున్నారు.

Also Read : రాజకీయ దిగ్గజం ములాయం కన్నుమూత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular