Monday, January 20, 2025
HomeTrending Newsతేడా తెలియకపోతే ఆహారం అవుతావ్: లోకేష్ పై నాని ఫైర్

తేడా తెలియకపోతే ఆహారం అవుతావ్: లోకేష్ పై నాని ఫైర్

నారా లోకేష్ సిఎం జగన్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని, దానికి తాను సమాధానం చెబితే బూతులు తిడుతున్నామని ఎదురుదాడి చేస్తారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.  నిన్న అవనిగడ్డలో దాదాపు 35వేల మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా 22ఏ-1 నిషేధిత జాబితాలో ఉన్న భూములపై హక్కు పత్రాలను అప్పగించే కార్యక్రమానికి సిఎం శ్రీకారం చుడితే  దీనికి మైలేజ్ రాకూడదనే ఉద్దేశంతో లోకేష్ ఈ కూతలు కూశారని మండిపడ్డారు.  జయంతి-వర్ధంతికి తేడా తెలియని పిచ్చి నా కొడుకు లోకేష్ సిఎం జగన్ ను పట్టుకొని ప్యాలెస్ పిల్లి నాకొడుకు  అంటున్నాడని ధ్వజమెత్తారు.

వర్ధంతికి-జయంతికి తేడా తెలియకపోతే ఏమీ కాదని, కానీ పులికి-పిల్లికి తేడా తెలియకపోతే ఆహారం అవుతాడని ఎద్దేవా చేశారు. జగన్ పులి కాబట్టే మంగళగిరిలో ఆహారం అయ్యావంటూ లోకేష్ పై ఎడురుదాడి చేశారు.  లోకేష్ వల్ల ఉపయోగం లేదని తెలిసే చంద్రబాబు దత్తపుత్రుడి దగ్గరకు హోటల్ కు వెళ్లి బూట్లు నాకి వచ్చారని అన్నారు. నీలాంటి దరిద్రుడు కొడుకుగా ఉండబట్టే  నీ తండ్రి పక్క పార్టీ నాయకుల కాళ్ళు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

మేము ఏదైనా అంటే దానిపై తప్పులు వెతికే కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, లోక్ సత్తా, జనసేన పార్టీల నేతలు లోకేష్ మాటలపై కూడా కాస్త గడ్డి పెట్టాలని సూచించారు. మా పార్టీకి నీతులు చెప్పే నేతలు ఇప్పుడేమయ్యారని నిలదీశారు. టిడిపి బూతుల కాలేజీకి అయ్యన్న పాత్రుడిని ప్రిన్సిపాల్ గా పెట్టి, మాస్టర్లను పెట్టి మరీ బూతుల్లో  పాఠాలు నేర్పుతున్నారని  అన్నారు.

Also Read : మేం వచ్చాక మళ్ళీ మారుస్తాం : లోకేష్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్