Friday, March 29, 2024
HomeTrending Newsఅరుణాచల్ ప్రదేశ్ లో మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదం

అరుణాచల్ ప్రదేశ్ లో మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదం

అరుణాచల్ ప్రదేశ్ లో ఈ రోజు మిలిటరీ చాపర్ ప్రమాదానికి గురైంది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలోని సింగింగ్ గ్రామం సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశం మారుమూల ప్రాంతం కావటంతో అక్కడికి చేరుకోవటం కష్టతరంగా మారింది. రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. అయితే హెలికాప్టర్ లో ఎంతమంది ఉన్నారనే దానిపై సమాచారం లేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు కోసం చూస్తున్నామని గౌహతిలో రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదే నెల ఐదో తేదిన చీత హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ప్రమాదానికి గురైంది. తవాంగ్ సెక్టార్ లో రక్షణ హెలికాప్టర్ లు ప్రమాదానికి గురికావటం సాధారణంగా మారింది. ఈ ప్రాంతం చైనా సరిహద్దులకు దగ్గరగా ఉండటంతో పొరుగు దేశం కుట్రలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో రక్షణ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 1995 లో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి చనిపోయినప్పటి నుంచి రెండు, మూడు ఏళ్ళకు ఒకసారి… తరచుగా జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో భారత్ వాయు సేన విమానాలు వాటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read హెలికాప్టర్‌ ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్