Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్T20 World Cup: బుమ్రా స్థానంలో షమీ

T20 World Cup: బుమ్రా స్థానంలో షమీ

గాయంతో టి 20 వరల్డ్ కప్ కు దూరమైన పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని ఎంపిక చేస్తూ సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. షమీ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాడు. బ్రిస్బేన్ లో బస చేసిన టీమిండియాతో కలిసి వామప్ మ్యాచ్ లు ఆడనున్నాడు.

షమీ గత నవంబర్ లో జరిగిన టి20 వరల్డ్ కప్ తరువాత పొట్టి ఫార్మాట్ మ్యాచ్ లు ఆడలేదు. కోవిడ్ కారణంగా ఇటీవల స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరిగిన టి 20 సిరీస్ కూడా ఆడలేకపోయాడు.  బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఇటీవలి సౌతాఫ్రికా టూర్ మధ్యలోనే నిష్క్రమించాడు. కాగా, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లను బ్యాకప్ ఆటగాళ్లుగా త్వరలోనే ఆసీస్ వెళ్లనున్నారు.

ఈ మెగా టోర్నీలో భాగంగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు గ్రూప్-2లో  ఉన్నాయి. ఇండియా తన తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్ తో ఈనెల 23న ఆడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular