Thursday, April 25, 2024
HomeTrending Newsసిఎం జగన్ తో బ్రిటిష్ బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌

సిఎం జగన్ తో బ్రిటిష్ బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌

బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని విన్‌ ఓవెన్ వెల్లడించారు.  ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై వివిధ అంశాలపై క్షణ్ణంగా చర్చించిన అంశాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు.

యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఇక్కడ కూడా అమలుచేయాలన్న ప్రణాళిక చాలా బావుందని ప్రశంసిస్తూ, దీనికి అవసరమైన సహకారం అందిస్తామని హామి ఇచ్చారు.  వైద్య, ఆరోగ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బ్రిటీష్‌ బృందానికి సిఎం జగన్ వివరించారు.

యూకే – భారత్‌ విద్యార్ధుల పరస్పర మార్పిడి విధానం, ఏపీ నుంచి ఎక్కువమంది విద్యార్ధులకు బ్రిటన్‌ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది, దీనిపై ఓవెన్ సానుకూలంగా స్పందించారు.

ఐటీ, పరిశోధన రంగాలపై ఆసక్తి కనబరిచిన బ్రిటన్ బృందం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకెళ్ళేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై బ్రిటీష్‌ బృందానికి ముఖ్యమంత్రి, వివరించారు, రాష్ట్రంలో అభివృద్ది చేస్తున్న పారిశ్రామిక పార్కుల పురోగతిపై చర్చ జరిగింది.

వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలను విన్‌ ఓవెన్‌ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి కూడా  చర్చ జరిగింది.  విద్యారంగానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రికి ఓవెన్‌ బృందం తెలిపింది.

ఈ సమావేశంలో బ్రిటీష్‌ కమిషన్‌ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పొలిటికల్‌ ఎకానమీ అడ్వైజర్‌ నళిని రఘురామన్, సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read :

సిఎంను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్