Friday, September 20, 2024
HomeసినిమాNagarjuna: హార్డ్ వర్క్ చేస్తోన్న నాగ్

Nagarjuna: హార్డ్ వర్క్ చేస్తోన్న నాగ్

అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ మూవీ తర్వాత చాలా కథలు విని ఆఖరికి నా సామి రంగ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు అనుహ్య స్పందన రావడంతో సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఈ సినిమాలో నాగార్జునతో పాటు యువ హీరోలు అల్లరి నరేష్‌, రాజ్ తరుణ్ కూడా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా టీజర్ తో పాటు ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

అయితే.. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నట్టుగా ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతికి పోటీ బాగా పెరిగింది. దీంతో నా సామి రంగ సినిమా వస్తుందా..? వాయిదా పడనుందా..? అనేది ఆసక్తిగా మారింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి సంక్రాంతికి ఈ సినిమా రాకపోవచ్చు అంటూ ప్రచారం ప్రారంభమైంది కానీ.. నాగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. అందుకనే డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారట. కంటిన్యూగా 60 డేస్ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ చేయాలని పక్కా ప్లాన్ రెడీ చేశారట.

ప్రస్తుతం హైదరబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఏ సినిమా వచ్చినా.. రాకపోయినా.. నా సామిరంగ సినిమా మాత్రం ఖచ్చితంగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దసరాకి ఈ మూవీ నుంచి అప్ డేట్ ఇవ్వనున్నారని తెలిసింది. సంక్రాంతికి వచ్చిన నాగ్ మూవీస్ సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలాగే నా సామి రంగ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అక్కినేని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్