Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్ICC Men's T20 World Cup 2022: జింబాబ్వేపై నెదర్లాండ్స్ గెలుపు

ICC Men’s T20 World Cup 2022: జింబాబ్వేపై నెదర్లాండ్స్ గెలుపు

పురుషుల టి20 వరల్డ్ కప్ సూపర్ 12 పోరులో నేడు జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే పై నెదర్లాండ్స్  5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  జింబాబ్వేను 117 పరుగులకే పరిమితం చేసిన డచ్ జట్టు లక్ష్యాన్ని  ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి సాధించింది.

అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, డచ్ పేస్ బౌలర్ల ధాటికి 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు మధేవెరె (1); కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ (3); చకబ్వా(5) త్వరగా ఔటయ్యారు. సికిందర్ రాజా-40; సీన్ విలియమ్స్-28 పరుగులు చేసి రాణించారు. 19.2 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్ మూడు; బ్రాండన్ గ్రోవర్, వాన్ బీక్, బాస్ దే లేదే తలా రెండు; ఫ్రెడ్ క్లాసేన్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత డచ్ జట్టు 17పరుగుల వద్ద ఓపెనర్ స్టెఫాన్ మైబర్గ్ (8) వికెట్ కోల్పోయింది. మాక్స్ ఓదౌద్-టామ్ కూపర్ లు రెండో వికెట్ కు 74 పరుగులు జోడించారు. కూపర్ 32 స్కోరు చేసి ఔట్ కాగా, ఓదౌద్ 52పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే నెదర్లాండ్స్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

మాక్స్ ఓదౌద్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular