Friday, March 29, 2024
HomeTrending Newsదొంగనోట్ల చెలామణికి డిజిటల్ రూపాయి చెక్

దొంగనోట్ల చెలామణికి డిజిటల్ రూపాయి చెక్

దొంగనోట్ల చలామనీని అరికట్టేందుకు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించిన డిజిటల్ రూపాయి (డిజిటల్ కరెన్సీ)  నిన్నటి నుంచి (నవంబర్ 1) అందుబాటులోకి వచ్చింది. ఆర్బీఐ హోల్‌సేల్ సెగ్మెంట్‌లో తొలి పైలెట్ ప్రాజెక్టుగా డిజిటల్ రూపాయి లావాదేవీలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంటర్‌ బ్యాంకు మార్కెటింగ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంట్లో ప్రస్తుతానికి తొమ్మిది బ్యాంకులు పాల్గొంటున్నట్టు ఆర్‌‌బిఐ ప్రకటించింది. స్టేట్ బ్యాంక్‌ ఆఫ్​ ఇండియాతో పాటు బ్యాంక్‌ ఆఫ్ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకుల్లో డిజిటల్ రూపీ లావాదేవీలు చేసుకోవచ్చు.

డిజిటల్ రూపాయిని బిట్ కాయిన్‌ తరహాలోనే వాడుకోవచ్చు. కరెన్సీ వాల్యూనే డిజిటల్ కరెన్సీకి కూడా ఉంటుంది. ఇప్పటికే కొన్ని రకాల డిజిటల్ కరెన్సీని ఇండియాలో వాడుతున్నప్పటికీ వాటికి ప్రభుత్వ ఆమోదం లేదు. అయితే ఆర్బీఐ ప్రవేశ పెట్టిన డిజిటల్ రూపీని చట్టబద్దంగా వాడుకోవచ్చు. డిజిటల్ రూపీ వాడటం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. కరెన్సీ డిజిటల్ రూపంలో ఉన్నందున దీన్ని దొంగిలించడం, ఫిజికల్‌గా డ్యామేజ్‌ చేయడం కుదరదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్