Thursday, April 25, 2024
HomeTrending Newsహైదరాబాద్ లో హుషారుగా సాగుతున్న జోడో యాత్ర

హైదరాబాద్ లో హుషారుగా సాగుతున్న జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 56వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో యాత్ర  హుషారుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో రాహుల్ కు సంఘీభావంగా పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో 8వ రోజు కొనసాగుతున్న యాత్ర బాలానగర్ నుంచి ప్రారంభమైంది. కూకట్​పల్లి నుంచి కేపీహెచ్​బీ జంక్షన్ వైపునకు సాగుతోంది. నిన్న రాత్రి బోయిన్‌పల్లిలోని గాంధీయన్ భావజాల కేంద్రంలో బస చేసిన రాహుల్.. నేడు బాలానగర్ మీదుగా జోడో యాత్ర కొనసాగిస్తున్నారు.

బాలివుడ్ హీరోయిన్ పూజ భట్ ఈ రోజు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ తో పాటు పాదయాత్ర చేసిన పూజ భట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ రోజు యాత్రలో కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, ఏమప్ జ్యోతిమణి లతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే సీతక్క, శ్రీధర్ బాబు తదితర నేతలు రాహుల్ గాంధీ తో అడుగులో అడుగు వేస్తున్నారు.

హబీబ్ నగర్, ముసాపేట్, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా ఈ యాత్ర సాగుతోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మియాపూర్ హోటల్ కినారా గ్రాండ్ వద్ద మార్నింగ్ బ్రేక్ తీసుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీహెచ్​ఈఎల్​ బస్ స్టాండ్ నుంచి తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. రామచంద్రాపురం, పటాన్​చెరు వరకు పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 7 గంటలకు ముత్తంగి వద్ద భారత్ జోడో యాత్ర కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేశ్​ మందిర్​లో రాహుల్ గాంధీ రాత్రి బస చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్