Tuesday, January 21, 2025
HomeTrending Newsహిమాచల్ లో ఖలిస్తాన్ జెండాల కలకలం

హిమాచల్ లో ఖలిస్తాన్ జెండాల కలకలం

శాసనసభ గోడలకు ఖలిస్తాన్ జెండాలపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అసెంబ్లీ ప్రధాన గేటు దగ్గరే జెండాలు కట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలోని సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. కొందరు ఖలిస్తాన్ సానుభూతిపరులు ద్విచక్ర వాహనాల ద్వారా తీసుకొస్తున్నారని, షిమ్లా లో కూడా ఖలిస్తాన్ జెండాలు ఎగురవేస్తామని సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయని వాటిపై విచారణ జరుపుతున్నామని హిమాచల్ పోలీసులు వెల్లడించారు. గోడల మీద ఖలిస్తాన్ అని రాసే వరకు పెట్రోలింగ్ వాహనాలు అటువైపు రాకపోవటం, ఖలిస్తాన్ జెండాలు కట్టే వరకు శాసనసభ పరిసరాల్లో సిసి కెమెరాలు లేవనే విషయం ఉన్నతాధికారుల దృష్టికి రాకపోవటం గమనార్హం.

ఖలిస్తాన్ జెండాలు, గోడ రాతలు కలకలం రేపుతున్నాయి. అది కూడా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రధాన ద్వారానికే ఖలిస్తాన్ జెండాలు కట్టి, గోడల మీద పంజాబీలో ఖలిస్తాన్ అని రాసి ఉండడం కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం హిమాచల్‎లోని ధర్మశాలలో నేరుగా అసెంబ్లీ ప్రహరీ గోడకే ఖలిస్తాన్ జెండాలు కట్టి ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. ఖలిస్తాన్ సానుభూతిపరులు రాత్రిపూట ఎప్పుడో వచ్చి కట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. వెంటనే బ్యానర్లను తొలగించి, ప్రహరీ గోడకు మళ్లీ పెయింటింగ్ వేయించారు. అయితే అసెంబ్లీ దగ్గరే సెక్యూరిటీ లేకపోవడం పైనా చర్చించుకుంటున్నారు. పంజాబ్ లో చెలరేగిపోతున్న ఖలిస్తాన్ సానుభూతిపరులు హిమాచల్ లోనూ బ్యానర్లు కట్టడంతో దీన్ని హిమాచల్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

Also Read : స్టాలిన్ ప్రజారంజక పాలన 

RELATED ARTICLES

Most Popular

న్యూస్