Saturday, November 23, 2024
HomeTrending NewsRahul Gandhi Disqualified:రాహుల్ గాంధిపై అనర్హత వేటు

Rahul Gandhi Disqualified:రాహుల్ గాంధిపై అనర్హత వేటు

పరువు నష్టం కేసులో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్ గాంధికి గుజరాత్​లోని సూరత్​ కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించడం వార్తల్లో నిలిచింది. కోర్టు తీర్పుతో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీపై పార్లమెంట్​ సభ్యుడిగా కొనసాగలేరని అనర్హత వేటు వేస్తూ పార్లమెంటు సచివాలయం కొద్ది సేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోకసభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. చట్టం ప్రకారం.. రాహుల్​ గాంధీ, తన వయనాడ్​ సీటును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

2019 లోక్​సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్​ గాంధీ. కోలర్​లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?” అని అన్నారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్​ మోదీ, లలిత్​ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో.. 2019లో గుజరాత్​లోని సూరత్​ జిల్లా కోర్టులో రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్​ దాఖలైంది. ఈ వ్యవహారంపై నాలుగేళ్ల విచారణ పూర్తి చేసిన అనంతరం గురువారం కీలక తీర్పును వెలువరించింది సూరత్​లోని జిల్లా కోర్టు. రాహుల్​ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్