Sunday, March 15, 2026
Homeసినిమా1400కు పైగా థియేటర్లలో సమంత 'యశోద' టీజర్

1400కు పైగా థియేటర్లలో సమంత ‘యశోద’ టీజర్

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద‘. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ ఈ చిత్రానికి దర్శకులు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు సినిమా టీజర్ విడుదల చేశారు.

‘యశోద’లో సమంత గర్భవతిగా కనిపించనున్నారని టీజర్ ద్వారా చెప్పారు. గర్భిణీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో లేడీ డాక్టర్ ఆమెకు చెబుతుంటే… అందుకు విరుద్ధంగా ఆమె జీవితంలో ఘటనలు జరుగుతున్నట్లు టీజర్‌లో చూపించారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ డాక్టర్ రోల్ చేస్తున్నారు. మణిశర్మ నేపథ్య సంగీతం ఉత్కంఠ పెంచింది. ఇందులో సమంత చాలా కొత్తగా కనిపించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిర్మాత మాట్లాడుతూ ”జాతీయ స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. జాతీయ స్థాయిలో దాదాపు 1400లకు పైగా థియేటర్లలో టీజర్ విడుదల చేశాం. సాధారణంగా థియేటర్లలో ట్రైలర్ విడుదల చేస్తారు. ఇన్ని థియేటర్లలో ఈ విధంగా టీజర్ విడుదల చేయడం ఇదే ప్రథమం. థియేటర్లలో, సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. సమంత నటన, చిత్ర నిర్మాణ విలువల గురించి మాట్లాడుతుంటే.. సంతోషంగా ఉంది. సమంత ఎంతో అకింత భావంతో యాక్షన్ సీన్స్ చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్రాన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular