‘నేను స్టూడెంట్ సర్!’ ఫస్ట్ లుక్ విడుదల

‘స్వాతిముత్యం’ సినిమాతో అరంగేట్రం చేస్తున్న బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాని ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో చేస్తున్నారు. ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న చిత్రమిది. తొలి చిత్రం ‘నాంది’ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ గా విజయవంతమైంది.‘నాంది’ సతీష్ వర్మ మరో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు.

ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్ లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ‘నేను స్టూడెంట్ సర్! ‘ టైటిల్ ఖరారు చేశారు. పోస్టర్‌లో గాయపడిన గణేష్ తన స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్‌ని చూపుతుండగా అతని చుట్టూ తుపాకులు గురిపెట్టడం ఇంట్రస్టింగ్ గా వుంది.

సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి  డైలాగ్స్ అందిస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Also Read : స్వాతిముత్యం అక్టోబర్ 5న విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *