Saturday, June 6, 2026
Homeసినిమా'అహింస' ఫస్ట్ గ్లింప్స్ విడుదల

‘అహింస’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల

దగ్గుబాటి అభిరామ్ తో పాటు పలువురు నూతన నటీనటులను వెండితెరకు పరిచయం చేస్తూ ప్రస్తుతం ‘అహింస‘ అనే  సినిమాను దర్శకుడు తేజ రూపొందించారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గతంలో ప్రీ లుక్‌ని విడుదల చేయగా నేడు ఫస్ట్ గ్లింప్స్ విడుదలైయింది.

హీరోని అటవీ ప్రాంతంలో ఒక గ్రూప్ అతని ముఖాన్ని జూట్ బ్యాగ్‌తో కప్పి లాక్కొని వెళ్ళడం కనిపిస్తోంది. అతని ముఖం నుండి రక్తం కారినట్లు గూండాలు దారుణంగా కొట్టడం గ్లింప్స్ లో చూడవచ్చు. అహింస అనే టైటిల్‌ ఉన్నప్పటికీ సినిమాలో యాక్షన్‌ డోస్‌ హెవీగా వుందని అర్ధమౌతోంది. అభిరామ్ సరసన గీతిక కథానాయికగా నటిస్తోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్‌పి పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.

చాలా కాలం తర్వాత తేజ, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఆర్‌పి పట్నాయక్‌ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ‘అహింస’ కోసం కలిసింది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందించగా, సుప్రియ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సదా, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : తేజ ‘అహింస’ షూటింగ్ పూర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular