Saturday, June 6, 2026
Homeసినిమాఈ నెల 15న ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ విడుదల

ఈ నెల 15న ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ విడుదల

తమిళ హీరో శింబు,  డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ కి ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలూ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మూడో సినిమాగా ‘వెందు తనిందదు కాడు’ రూపొందింది. సిద్దీ ఇధ్నానీ ఇందులో కథానాయక. ఏఆర్ రెహమాన్ స్వరాలందించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి.కె. గణేష్  నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. ఈ నెల 15న విడుదల కానుంది.

‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ “ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా పాజిటివ్ గా ఉందనిపించింది. శింబు యాక్టింగ్ గురించి, గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి, రెహమాన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శింబూకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే గౌతమ్ మీనన్ కి కూడా. ఇంతకు ముందు మా ‘స్రవంతి’ సంస్థలో ‘నాయకుడు’ , ‘ పుష్పక విమానం’ , ‘ రెండు తోకల పిట్ట’, రఘువరన్ బీటెక్’ చిత్రాలు డబ్ చేశాం. అవి తెలుగులో సంచలన విజయం సాధించాయి. ఇప్పుడు ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ తో అసోసియేట్ కావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఖ‌చ్చితంగా నచ్చే కాన్సెప్ట్ ఇది. ఈ నెల 15న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాo’’ అని తెలిపారు.

Also Read : నాగ‌చైత‌న్య‌, శింబు మ‌ల్టీస్టార‌ర్?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular