అక్కినేని నాగ‌చైత‌న్య ఇటీవ‌ల ‘థ్యాంక్యూ‘ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించ‌లేదు. ఈ మూవీ త‌ర్వాత లాల్ సింగ్ చ‌డ్డా అంటూ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేదు. ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు డైరెక్ష‌న్ లో తెలుగు, త‌మిళ్ లో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి న‌టిస్తుంది.

ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య‌… ప‌ర‌శురామ్ డైరెక్ష‌న్ లో ఓ సినిమా ఎప్పుడో చేయాలి. మ‌హేష్ బాబు నుంచి ఆఫ‌ర్ రావ‌డంతో ప‌ర‌శురామ్ స‌ర్కారు వారి పాట చేశాడు. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మూవీ ఆల‌స్యం అయ్యింది. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌తో ప‌ర‌శురామ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ని… నాగ‌చైత‌న్య‌తో పాటు మ‌రో హీరోగా శింబు న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

పరశురామ్ ఇప్పటికే ఇటు నాగచైతన్యకి, అటు శింబుకి ఈ కథకు సంబంధించిన పాయింట్ కూడా చెప్పాడని వీరిద్ద‌రూ ఓకే చెప్పార‌ని స‌మాచారం. ప్రస్తుతం పరశురామ్ పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసే పనుల్లో ఉన్నాడని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ మూవీని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది.

Also Read నెపోటిజం గురించి చైత‌న్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *