Saturday, June 13, 2026
HomeTrending Newsకాసేపట్లో సంగం బ్యారేజ్ జాతికి అంకితం

కాసేపట్లో సంగం బ్యారేజ్ జాతికి అంకితం

సింహపురి వాసుల దశాబ్దాల కల నేడు నేరవేరుతోంది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యింది. వాటిని మరికాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జాతికి అంకితం చేయనున్నారు.
ఏళ్ల తరబడి ఈ బ్యారేజ్‌ కోసం నెల్లూరు వాసులు ఎదురు చూస్తున్నారు.  జలయజ్ఞంలో భాగంగా సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్‌ పనులు నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు  మహానేత హఠాన్మరణంతో ఈ  బ్యారేజీ పనులు నిలిచి పోయాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంగం, నెల్లూరు బ్యారేజీ పనులను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టారు సిఎం జగన్.

ఒకవైపు కరోనా కష్టకాలం, మరోవైపు పెన్నానది వరద ఉధృతి వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రాజెక్టుల నిర్మాణం  జరిగి పనులు పూర్తయ్యాయి.

Also Read : సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సిఎం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular