సింగపూర్ ఓపెన్ లో భారత ఆటగాళ్ళు పివి సింధు, సైనా, ప్రణయ్ లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు.
మహిళల సింగిల్స్ లో పివి సింధు 19-21; 21-19;21-18తో వియత్నాం క్రీడాకారిణి ఎన్-గుయెన్ పై; సైనా నెహ్వాల్ 21-19; 11-21; 21-17తో చైనా క్రీడాకారిణి హే బింగ్ జియావో పై గెలుపొందారు.
పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ 14-21; 22-20; 21-18తో తైవాన్ ప్లేయర్ చౌ టీన్ చెన్ పై విజయం సాధించాడు.
పురుషుల డబుల్స్ లో ఎమ్మార్ అర్జున్, ధృవ్ కపిల ద్వయం 18-21; 24-22; 21-18తో మలేషియా ఆటగాళ్ళు గొ జె ఫీ-నుర్ ఇజ్జుద్దిన్ పై గెలుపొందారు.
సింగల్స్ విభాగంలో ఆశ్మిత చలీహా, మిథున్ మంజునాథ్….. మిక్స్డ్ డబుల్స్ లో నితిన్- రామ్ పూర్విష జోడీ, మహిళల డబుల్స్ లో పూజా దండు- ఆర్తి సారా సునీల్ జంట రెండో రౌండ్లో ఓటమి పాలయ్యారు.