Saturday, November 23, 2024
HomeTrending News2023-24కి తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు

2023-24కి తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు

Telangana Budget : అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావు 2023- 2024 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్లకు గతేడాదికంటే రూ.272 కోట్లు అధికంగా కేటాయించింది. గత బడ్జెట్‌లో ఆసరా పెన్షన్లకు రూ,11,728 కోట్లు కేటాయించగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తాన్ని రూ.12000 కోట్లకు పెంచింది. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగా ఇచ్చిన రూ.200 పింఛన్‌ను తెలంగాణ సర్కార్‌ రూ.2016కు, దివ్యాంగులకు రూ.3016కు పెంచింది. ఎవరూ డిమాండ్‌ చేయకపోయినా బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్‌ పేషెంట్లకు కూడా నెలకు రూ.2016 అందిస్తున్నదని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు.2014లో 29,21,828 మందికి పింఛన్లు ఇస్తుండగా.. వారికి ఏటా రూ.861 కోట్లు ఖర్చయ్యేవని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్‌ లబ్ధిదారుల సంఖ్యను 44,12,882 మందికి పెంచిందన్నారు. దీంతో ప్రభుత్వం ఏటా రూ.11,628 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ఆసరా లబ్ధిదారులకు రూ.54,989 కోట్లు అందించిందన్నారు. గత బడ్జెట్లో ప్రకటించిన విధంగా 57 ఏండ్లు నిండిన వారికి కూడా పెన్షన్‌ అందిస్తున్నామని చెప్పారు. దీంతో 8,96,592 మంది లబ్ధిదారులు కొత్తగా చేరారని వెల్లడించారు.

స్థానిక సంస్థ‌ల‌కు మ‌రో శుభవార్త‌

2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు స్థానిక సంస్థ‌ల‌కు శుభ‌వార్త వినిపించారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసే ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, ప‌ల్లె ప్ర‌గ‌తి నిధుల‌తో పాటు ఫైనాన్స్ క‌మిష‌న్ నిధుల‌ను కూడా స్థానిక సంస్థ‌ల ఖాతాల్లోకి నేరుగా బ‌దిలీ చేయాల‌ని సీఎం నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ఈ సంస్క‌ర‌ణ వ‌ల్ల స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు ఫైనాన్స్, ట్రెజ‌రీల ఆమోదం కోసం వేచి చూడ‌కుండా, స్వ‌తంత్రంగా నిధులు వినియోగించుకునే అవ‌కాశం క‌లుగుతుంద‌న్నారు.

బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయించిన పద్దుల వివరాలు
రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు.. నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు.. విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు.. ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు.. ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు.. దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు.. గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు.. బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు.. వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు.. షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు.. వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు.. విద్యా రంగానికి రూ.19,093 కోట్లు.. రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు.. హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు.. పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు.. రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు.. హోంశాఖకు రూ.9,599 కోట్లు.. మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు.. మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు.. రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు.. రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్