Sunday, February 23, 2025
HomeTrending Newsదిశ యాప్‌కు కేంద్రమంత్రి ప్రశంస

దిశ యాప్‌కు కేంద్రమంత్రి ప్రశంస

Disha App Great: రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశ యాప్ పనితీరుపై కేంద్ర సమాచార, ప్రసార, మత్స్య పరిశ్రమ శాఖ సహాయ మంత్రి మురుగన్  ప్రశంసలు కురిపించారు.  కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి నిర్వహిస్తోన్న సేవ, సుపరిపాలన,  అంత్యోదయ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ వచ్చిన కేంద్ర మంత్రి 36వ డివిజన్‌ సచివాలయంలో విధుల్లో ఉన్న మహిళా పోలీస్‌ ఫోన్‌ నుంచి దిశ యాప్‌ పనితీరును ఆయన పరిశీలించారు.

దిశ యాప్‌ను బటన్‌ నొక్కి న కేంద్ర మంత్రికి సెకన్ల వ్యవధిలో కంట్రోల్‌రూమ్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది.  దీంతో ఈ యాప్ తో తీసుకున్న  చర్యలు బాగున్నాయంటూ కేంద్ర మంత్రి అభినందనలు ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కగా.. సెకన్ల వ్యవధిలో దిశ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఫోన్‌ రావడంతో.. కేంద్ర మంత్రే దానికి జవాబిచ్చారు. ‘నేను కేంద్ర మంత్రి మురుగన్‌ను, దిశ యాప్‌ పనితీరును పరిశీలించేందుకే ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కాను’ అని వారికి తెలియజేశారు. దిశ యాప్‌తో పాటు కంట్రోల్‌ రూమ్‌లు, ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు, సిబ్బందిని ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించడం అభినందనీయమన్నారు.

Also Read : మహిళలకు అస్త్రం దిశ యాప్: జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్