Tuesday, April 16, 2024
Homeసినిమాకేజీఎఫ్-2 100 డేస్ కంప్లీట్, పార్ట్-3 ఎప్పుడు?

కేజీఎఫ్-2 100 డేస్ కంప్లీట్, పార్ట్-3 ఎప్పుడు?

కేజీఎఫ్ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. అంత‌కు మించి.. కేజీఎఫ్ 2 సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ అయితే.. కేజీఎఫ్ 2 మూవీకి జ‌నాల్లో ఇంత‌టి క్రేజ్ ఏంట‌ని షాక్ అయ్యింది. అలాగే ఒక క‌న్న‌డ సినిమా ఈ రేంజ్ లో స‌క్సెస్ సాధిస్తుంద‌ని బ‌హుశా ప్ర‌శాంత్ నీల్ కూడా ఊహించి ఉండ‌రు. అంత‌లా కేజీఎఫ్ 2 రికార్డు క‌లెక్ష‌న్స్ సాధించింది.

కన్న‌డ స్టార్ య‌ష్‌, శ్రీనిధి శెట్టి జంట‌గా న‌టించిన ఈ మూవీ రిలీజై 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఇంట్రెస్టింగ్ వీడియోని రిలీజ్ చేసి ఆడియెన్స్ కి దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు థాంక్స్ తెలిపారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటించగా రవీనా టాండన్ కీలక పాత్రలో నటించింది. అలాగే ప్రకాష్ రాజ్ రావు రమేష్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య‌ పాత్రల్లో నటించారు.

ఇక కేజీఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా కేజీఎఫ్ 3 ఉంటుంద‌ని మేక‌ర్స్ గ‌తంలో ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి కేజీఎఫ్ 3 అప్ డేట్స్ గురించి అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే.. ప్ర‌శాంత్ నీల్ స‌లార్ లో బిజీగా ఉన్నారు. ఆత‌ర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయాల్సివుంది. ఆత‌ర్వాత చ‌ర‌ణ్ తో కూడా ప్ర‌శాంత్ నీల్ మూవీ ఉంటుంద‌ని టాక్ వ‌చ్చింది. అందుచేత కేజీఎఫ్ 3 స్టార్ట్ కావ‌డానికి టైమ్ ప‌డుతుంది. అయితే.. కేజీఎఫ్ 3 వ‌స్తే చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయ‌మ‌నే టాక్ ఉంది.

Also Read కేజీఎఫ్-3 కి ముహుర్తం ఖరారు! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్