Wednesday, April 17, 2024
HomeTrending Newsశ్రీశైలం నుంచి నీరు విడుదల

శ్రీశైలం నుంచి నీరు విడుదల

Srisailam Gates opened: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు క్రషర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పూజలు నిర్వహించి, బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలు పెట్టారు.  శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు  గత ఏడాది జూలై 28న గేట్లు ఎత్తగా ఈఏడు ఐదు రోజులు  రోజులు ముందుగానే గేట్లు ఎత్తారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ చేపల వేటకోసం కాలవల వద్దకు వెళ్ళవద్దని అధికారులు సూచించారు.

Water Krishna Deltaa

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టు వద్ద 198.36 టిఎంసిల నీరు  నిల్వ  ఉంది. ప్రాజెక్టులోని 6,7,8 నంబర్ గేట్లు ఎత్తి పది అడుగుల ఎత్తు మేర నీటిని విడుదల చేశారు.  మూడు గేట్ల నుంచి షుమారు 80 వేల క్యూసెక్కుల నీటిని వదలనున్నారు.  పరిస్థితిని బట్టి మొత్తంగా లక్ష క్యూసెక్కుల పైగా నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు వద్ద ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్త్రాలు జలవిద్యుత్ ఉత్పత్తిని ను మొదలు పెట్టాయి.

Also Read : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద 

RELATED ARTICLES

Most Popular

న్యూస్