Saturday, April 20, 2024
HomeTrending Newsత్వరలో 111 జీవో ఎత్తివేత

త్వరలో 111 జీవో ఎత్తివేత

111 G O Lift Soon : వీలైనంత తర్వరలో జీవో 111 ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మంగళవారం ద్రవ్య వినియమ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం మాధానాలిచ్చారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య 111 జీవోను ఎత్తివేయాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ‘సుమారు 1,32,600 ఎకరాల భూమి జీవో పరిధిలో ఉంది. ఎమ్మెల్యే యాదయ్య చెప్పినట్లు 83 గ్రామాలు, ఏడు మండలాలు కలిసి ఉన్నాయి. గతంలో మనకు ఉన్న ట్యాంక్స్‌ ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ గానీ అక్కడి నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లు తీసుకునేది తగ్గిపోయింది.. ఎండాకాలంలో.. అక్కడి నుంచి నీళ్లు తీసుకునే సందర్భం ఉండే.
111 జీవోలో ఆ లేక్స్‌ కలుషితం కాకుండా ఉండాలంటే బ్యాన్‌ పెట్టాలని ఆ రోజుల్లో ఉన్న ప్రభుత్వం ఎక్స్‌పర్ట్‌ కమిటీ నివేదిక నిర్ణయం మేరకు తీసుకున్నది. ఈ రోజు సంతోషంగా తెలియజేస్తున్నా. హైదరాబాద్‌ నగరానికి ఈ రెండు ట్యాంక్స్‌ నీళ్లు వాడుకునే అవసరం లేదు. సమస్య పూర్తిగా సమసిపోయింది. సింగూరు నుంచి బంద్‌ చేశాం. గోదావరి, కృష్ణా నీళ్లు సఫిషియంట్‌గా తెస్తున్నాం. 40టీఎంసీలు తేవడానికి సుంకిశాల నుంచి నిధులు కూడా మంజూరు చేశాం. అదేవిధంగా పనులు కూడా స్టార్టవుతున్నాయ్‌.
అదేవిధంగా గోదావరి జలాలు మల్లన్న సాగర్‌ నుంచి పుష్కలంగా గ్రావిటీ ద్వారానే హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ స్కీమ్‌ అండ్‌వేవ్‌లో ఉన్నది. భవిష్యత్‌లో ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు. 111 జీవో అర్థ రహితం, రిడెండెంట్‌ కూడా అయిపోయింది. 1.32వేల ఎకరాలకు సంబంధించిన జీవోను ఎత్తివేస్తే అభివృద్దికి అవకాశం ఉంటది. చీఫ్‌ సెక్రెటరీకిని, హెచ్‌ఎండీఏను రెక్వెస్ట్‌ చేశాం.  అక్కడ కూడా కఠినంగా గ్రీన్‌ జోన్‌, మాస్టర్‌ ప్లాన్‌, రోడ్స్‌.. జీహెచ్‌ఎంసీ ఎలా అయితే ఉందో.. అదే పద్ధతిలో కొనసాగే విధంగా చర్యలు వీలైనంత త్వరలో జీవో 111ను ఎత్తి వేస్తాం. నిపుణుల కమిటీ నివేదిక కూడా రావాల్సి ఉంది’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Also Read : ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌ ఉద్యోగులకు తీపి కబురు

RELATED ARTICLES

Most Popular

న్యూస్