మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా ఎటపల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 13 మంది మావోలు చనిపోయారు. మహారాష్ట్ర పోలీసులకు చెందిన సి-60 యూనిట్ కు చెందిన కమాండోలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.
మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ మొదలు పెట్టారు. పొలీస్ కదలికలను గమనించిన మావోలు కాల్పులు జరిపారు, పోలీసులకు- మావోలకు జరిగిన ఎదురు కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మరణించారు. కొన్ని ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం ఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి కొందరు మావోలతో పాటు పొలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు. పోలిసుల కూంబింగ్ కొనసాగుతోంది.
మావోయిస్టుల కదలికలపై సమాచారంతో నిన్ననే ఈ ఆపరేషన్ మొదలు పెట్టమని, ఇప్పటివరకు 13 మృతదేహాలు లభ్యమయాయని పొలిసు అధికారి సందీప్ పాటిల్ వెల్లడించారు.