Sunday, June 7, 2026
HomeTrending Newsత్వరలో 13 వేల టీచర్‌ పోస్టులు భర్తీ

త్వరలో 13 వేల టీచర్‌ పోస్టులు భర్తీ

Ambedkar’s aspirations: త్వరలో 13 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రెండు భాషల్లో బోధన ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్ళి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం డైనింగ్ హాల్‌ని ప్రారంభించిన ఆయన.. అనంతరం అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను కొంత వరకైనా పాటించాలి.. ఆయన స్ఫూర్తిలో మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలన్నారు.

సమాజంలో పేదరికం వల్లే మనుషుల్లో తేడా వచ్చిందన్నారు హరీష్‌రావు.. పేదరికాన్ని రూపు మాపెందుకే సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని తెచ్చారని గుర్తుచేశారు. మరోవైపు, విద్య, ఉద్యోగాల్లో, కాంట్రాక్ట్‌లలో కూడా రిజర్వేషన్‌ తెచ్చామన్న మంత్రి హరీష్‌రావు.. విద్యలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా అందించేందుకు రూ.7,300కోట్లతో మన ఊరు మన బడి పథకం తెచ్చామన్నారు. రాష్ట్రంలో 13 వేల టీచర్‌ ఉద్యోగాలను త్వరలోనే భర్తీచేస్తామని వెల్లడించారు. ఇక, తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో బోధనా జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ లో 50 శాతం దళితులకు అవకాశం కల్పించామన్నారు. స్వాతంత్ర వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా కొన్ని గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలు లేవు, త్వరలోనే అన్ని గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి హరీష్‌రావు.

Also Read : రెండో విడత ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular