సిఎం జగన్ ను కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌

2021 బ్యాచ్‌ ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌ క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిసి వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కూడా సమావేశమయ్యారు.

ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని సిఎం సూచించి వారికి ఆల్‌ ద వెరీ బెస్ట్‌  చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌ పి. ధాత్రిరెడ్డి, వై.మేఘ స్వరూప్, ప్రఖర్‌  జైన్, గొబ్బిళ్ళ విద్యాధరి, శివ నారాయణ్‌ శర్మ, అశుతోష్‌ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్‌ మీనా, సూరపాటి ప్రశాంత్‌ కుమార్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *