మహిళల ఆసియా కప్ -2022 లో ఇండియాపై పాకిస్తాన్ 13పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ విసిరిన 138 పరుగుల లక్ష్య ఛేదనలో భారత మహిళలు విఫలమయ్యారు. 19.4ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 33  పరుగులకే మూడు కీలక వికెట్లు (అమీన్-11;మునీబా అలీ-17;  ఒమైనా సోహైల్-డకౌట్) కోల్పోయింది.  కెప్టెన్ మరూఫ్- నిదా దార్ లు నాలుగో వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యం వహించారు. మరూఫ్ 32 పరుగులు చేసి అవుట్ కాగా, దార్ 56 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.  నిర్ణీత 20  ఓవర్లలో 6వికెట్లకు 137 పరుగులు చేసింది.

ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ మూడు; పూజా వస్త్రాకర్ రెండు; రేణుకా సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఇండియా 23 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వరుస వికెట్లు కోల్పోయింది, సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమయ్యారు. రిచా ఘోష్-26; హేమలత-20; స్మృతి మందానా-17; దీప్తి శర్మ-16 పరుగులతో ఫర్వాలేదనిపించారు.

పాక్ బౌలర్లలో నష్రా సందు మూడు; సదియా ఇక్బాల్, నిదా దార్ చెరో రెండు; ఐమన్ అన్వర్, తుబా హాసన్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన నిదా దార్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

భారత జట్టు రేపు బంగాదేశ్ తో తలపడనుంది.

Also Read : India Vs Australia: మొదటి టి20లో ఆసీస్ అద్భుత విజయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *