Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్సెంచూరియన్ టెస్ట్ : రెండో రోజు ఆట రద్దు

సెంచూరియన్ టెస్ట్ : రెండో రోజు ఆట రద్దు

Rain stopped Rahul: సెంచూరియన్ టెస్ట్ రెండో రోజు ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం, మేఘాల కారణంగా వెలుతురు లేకపోవడంతో మొదటి సెషన్ ను అంపైర్లు రద్దు చేశారు. లంచ్ ను త్వరగా ముగించాలని సూచించారు. లంచ్ తరువాత పరిస్థితిని మరోసారి సమీక్షించి, ఆట కొనసాగించేందుకు  పిచ్ అనుకూలంగా లేకపోవడంతో రెండోరోజు పూర్తి ఆటను రద్దు చేస్తున్నట్లు  ప్రకటించారు,

ఇండియా- సౌతాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ సెంచూరియన్ స్పోర్ట్ పార్క్ స్టేడియంలో నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 272 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ (122) తన టెస్ట్  కెరీర్ లో ఏడవ సెంచరీ నమోదు చేశాడు. రాహుల్ -122; అజింక్యా రెహానే-40 పరుగులతోను క్రీజులో ఉన్నారు.

రాహూల్, రెహానే ఆట చూసేందుకు ఉవ్విల్లూరుతోన్న భారత క్రికెట్ ప్రేక్షకుల ఆశలపై వరుణుడు నీళ్ళు జల్లాడు.

Also Read :రాహుల్ సెంచరీ; పూజారా విఫలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular