Tuesday, September 24, 2024
Homeసినిమాడిసెంబర్ 1న ‘బంగార్రాజు’ నుండి ‘నా కోసం’ సాంగ్

డిసెంబర్ 1న ‘బంగార్రాజు’ నుండి ‘నా కోసం’ సాంగ్

Bangarraju-Naa Kosam Song : 

కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ‘బంగార్రాజు’ సినిమా నుంచి విడుదల చేసిన ‘లడ్డుండా’ పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘లడ్డుండా..’ పాటతో ఏర్పడిన అంచనాలను ముందుకు తీసుకెళ్లేందుకు రెండో పాటను రెడీ చేశారు. డిసెంబర్ 1న ఉదయం 11:12 గంటలకు రెండో పాట ‘నా కోసం’ టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. నాగ చైతన్య, కృతి శెట్టిలపై రొమాంటిక్ సన్నివేశాలు ఈ పాటలో కనిపించబోతోన్నాయి.

మొదటిసారిగా నాగ చైతన్య, కృతిశెట్టి జోడిగా కనిపించబోతోన్నారు.  ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా అనూప్ రూబెన్స్ మంచి పాటలను అందించనున్నారు.  మైసూర్‌లో ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు. బంగార్రాజు మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు .

Also Read : ‘బంగార్రాజు’ నుండి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్