Athawale on Amaravathi: మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉంటే ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుందని, కానీ వాటిని నిర్మించడం కష్టమని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) పార్టీ అధ్యక్షులు రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీ రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించి ఉండాల్సిందని, కానీ యూపీఏ ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించిందని అన్నారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ ప్రధానిని కలిసి వివరించాలని సూచించారు. జగన్‌కు పాలించే అవకాశం రావటం చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బ అని అథవాలే వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో చేతులను కలపాలని జగన్ కు తాను గతంలోనే సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ పాలన బాగానే చేస్తున్నారని కితాబిచ్చారు. పీకే కేంద్రం నుంచి ఆర్ధిక సహాయం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. పార్లమెంట్‌లో తమ ప్రభుత్వం తెస్తోన్న అన్ని బిల్లులకూ వైసీపీ మద్దతు ఇస్తోందని అథవాలే చెప్పారు.
హిజాబ్ అంశం కర్ణాటక ప్రభుత్వ నిర్ణయమని, మతపరమైన అంశాలు విద్యాసంస్థల్లో ఉండకూదదన్నని తన వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడించారు. స్కూళ్ళల్లో బుర్ఖాలు ధరించాల్సిన అవసరం లేదన్నారు.