Sunday, June 14, 2026
Homeసినిమాలగడపాటి విక్రమ్ ‘వర్జిన్ స్టోరీ’ నుంచి మూడో లిరికల్ సాంగ్

లగడపాటి విక్రమ్ ‘వర్జిన్ స్టోరీ’ నుంచి మూడో లిరికల్ సాంగ్

on Valentine’s Day: నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్. తాజాగా దిల్ రాజు నిర్మించిన రౌడీ బాయ్స్ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. రౌడీ బౌయ్స్ లో విక్రమ్ చేసిన క్యారెక్టర్ కు, అతని పర్మార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక ఈ యంగ్ టాలెంట్ ‘వర్జిన్ స్టోరి’ తో హీరోగా పరిచయం అవుతున్నారు. ‘కొత్తగా రెక్కలొచ్చెనా..’అనేది ఈ సినిమా క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి ఈ చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 3 వ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఫిల్మ్ యూనిట్. సోషల్ మీడియా ద్వారా పాటను డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుంది’ అనే పాయింట్ తో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేసేలా వర్జిన్ స్టోరి సినిమా ఉంటుందని నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular