Sunday, January 19, 2025
Homeసినిమాస‌ర్కారు మూడో పాట‌కు ముహుర్తం కుదిరిందా?

స‌ర్కారు మూడో పాట‌కు ముహుర్తం కుదిరిందా?

Sarkar-Song3: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ న‌టిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. అయితే.. ఈ సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పాట‌ల‌ను రిలీజ్ చేశారు.

ఈ రెండు పాట‌లకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. యూట్యూబ్ లో అయితే.. రికార్డు వ్యూస్ తో దూసుకెళుతూ స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తున్నాయి. దీంతో అభిమానులు ఈ సినిమా మూడో పాట కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా రిలీజ్ చేస్తార‌ని టాక్ మాత్రం గ‌ట్టిగా వినిపిస్తోంది. మేక‌ర్స్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు. దీంతో ఉగాదికి స‌ర్కారు వారి ఇచ్చే అప్ డేట్ ఏంటి అనేది ఆస‌క్తిగా మారింది.

మే 12న స‌ర్కారు వారి పాట ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Also Read : సోష‌ల్ మీడియాలో తండ్రీ కూతుళ్ళ హల్ చల్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్