Sunday, January 19, 2025
HomeTrending Newsదివ్యాంగులకు 4% రిజర్వేషన్‌

దివ్యాంగులకు 4% రిజర్వేషన్‌

4 Reservation : అన్ని ప్రభుత్వ శాఖల్లో నిర్దేశిత వైకల్యమున్న ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వికలాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్‌-34ను అనుసరించి..ప్రభుత్వ విభాగాల్లో నిర్దేశిత వైకల్యమున్న ఉద్యోగులకు (పీడబ్ల్యూబీడీలకు) రిజర్వేషన్లు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీచేయాలని సుప్రీంకోర్టు గత సెప్టెంబరులో కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు- గ్రూప్‌-సి, గ్రూప్‌-సి నుంచి గ్రూప్‌ బి,  గ్రూప్‌-బి, గ్రూప్‌-బి నుంచి దానికంటే దిగువ స్థాయి వరకూ ఉన్న కేడర్లలోని మొత్తం ఖాళీల్లో 4% పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటాయించాలంటూ సిబ్బంది, శిక్షణ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకూ మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రత్యక్ష నియామకాలు 75% మించని కేడర్లలో చేపట్టే పదోన్నతులకు ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఫిర్యాదుల పరిష్కార అధికారిగా ఒక సీనియర్‌ అధికారిని నియమించాలని ప్రతి డిపార్టుమెంటునూ ఆదేశించింది. పదోన్నతుల్లో తమకు అన్యాయం జరుగుతున్నట్టు భావించే దివ్యాంగ ఉద్యోగులు.. తమ వివరాలతో ఈ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అధికారి ఫిర్యాదులకు సంబంధించి రిజిస్టర్‌ నిర్వహించడమే కాకుండా… వాటిపై రెండు నెలల్లోగా విచారణ చేపట్టి, ఎలాంటి చర్యలు, నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది ఫిర్యాదుదారులకు తెలియజేయాల్సి ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్