Thursday, March 28, 2024
HomeTrending Newsజగిత్యాల లో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు

జగిత్యాల లో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు

రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ శంకర్ గారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు ఈనెల 9, 10,11 తేదీలలో జగిత్యాల జిల్లా కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ శంకర్, రాష్ట్ర మహాసభల స్వాగత సమితి చైర్మన్ వాసం శివప్రసాద్ లు తెలిపారు. మహాసభల నిర్వాహణ ఏర్పాట్ల కోసం ఆదివారం స్వాగత సమితి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల ప్రాంతం మొదటి నుండి జాతీయవాదులకు అడ్డాగా ఉందన్నారు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే భ్రమల్లో ఉంచి ఎంతోమంది యువకులను తీవ్రవాదం వైపు మరల్చిన నక్సలైట్లను ఎదిరించి జగిత్యాల గడ్డపై కాషాయ జెండాను ఎగిరించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. జగిత్యాల స్ఫూర్తితోనే రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా జాతీయవాద సంస్థలు బలపడ్డాయని తెలిపారు.

తీవ్రవాదులతో పోరాడి అమరులైన రామన్న, గోపన్న, జితేందర్ రెడ్డి, మధుసూదన్ గౌడ్ ల స్ఫూర్తిని నేటి తరం యువతకు అందించాలనే ఉద్దేశంతో ఏబీవీపీ 41 వ రాష్ట్ర మహాసభలను జగిత్యాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు.మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థి నాయకులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో విద్యారంగ స్థితి, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై పలు చర్చలు, తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. మహాసభల మొదటి రోజు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక జరుగుతుందని, రెండవ రోజు జగిత్యాల పట్టణంలో విద్యార్థి శక్తి ప్రదర్శన పేరుతో భారీ ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు. పట్టణంలోని గీతా విద్యాలయం గ్రౌండ్లో జరగనున్న మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి కరుణాకర్, మహాసభల స్వాగత సమితి కార్యదర్శి మ్యాన మహేష్, ఉపాధ్యక్షులు ముసిపట్ల రాజేందర్, యాద రామకృష్ణ, సభ్యులు డాక్టర్ భీమనాతిని శంకర్, ముదుగంటి రవీందర్ రెడ్డి, ఏసీఎస్ రాజు, బెజ్జంకి సంపూర్ణ చారి, బోనగిరి దేవయ్య, నరేందర్రావు, రాజశేఖర్, మురళి,.రాజు సాగర్, సాయి,.నవీన్,.నందు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్