Thursday, January 23, 2025
Homeజాతీయంబెంగాల్ మంత్రివర్గం ప్రమాణం

బెంగాల్ మంత్రివర్గం ప్రమాణం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గం నేడు ప్రమాణం స్వీకరించింది. 43 మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. వీరిలో 42 మంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. అనారోగ్యంతో ఎన్నికల్లో పోటి చేయని అమిత్ మిత్రాకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది, గత ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అమిత్ మరోసారి అదే శాఖను చూడనున్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి రాజ్ భవన్ లో మత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది.
40 మంది రాజ్ భవన్ లో ప్రమాణం చేయగా ముగ్గురు మంత్రులు వర్చువల్ గా ప్రమాణం చేశారు. కోవిడ్ బారిన పడి బ్రత్య బసు, రతిన్ ఘోష్….. అనారోగ్యంతో ఉన్న అమిత్ మిత్రాలు నేరుగా ప్రమాణం స్వీకరించలేదు. మూడు విడతలుగా మంత్రులు సామూహికంగా ప్రమాణం చేశారు.

17 కొత్త వారికి పదవులు దక్కాయి. క్రికెటర్ మనోజ్ తివారికి మంత్రివర్గంలో చోటు లభించింది. మంత్రి వర్గంలో 24 మంది కేబినేట్ మంత్రులు కాగా 10మంది సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ ఛార్జ్); 9 మంది సహాయ మంత్రులు. ముగ్గురు మహిళలకు, ఏడుగురు మైనార్తిలకు చోటు దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్