Saturday, July 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వాక్సిన్ పంపిణి కూపన్లు

వాక్సిన్ పంపిణి కూపన్లు

రాష్ట్రంలో కరోనా వాక్సిన్ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వాక్సినేషన్ సెంటర్లు కరోనా వ్యాప్తికి నిలయంగా మారడం పట్ల ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. నేడు, రేపు వాక్సిన్ పంపిణి నిలిపివేసింది. రెండో డోసు వాక్సిన్ పంపిణి ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, దీనికోసం కూపన్లు పంపిణి చేయాలని నిర్ణయించింది. ఓటర్లకు ఇచ్చినట్లుగానే స్లిప్పులు పంపిణి చేయనుంది.

ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి వాక్సిన్ ఇస్తారనే వివరాలు ఆ కూపన్ లో వుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఎన్ ఏం లు, ఆశా వర్కర్లు …. పట్టణ ప్రాంతాల్లో ఎస్ ఏం ఎస్ ల ద్వారా సమాచారం అందిస్తారు.

రాష్ట్రంలో ఎక్కడా మొదటి డోస్ పంపిణి చేయవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్