Sunday, February 23, 2025
HomeTrending Newsబ్రిటన్ లో 50 వేల కరోనా కేసులు

బ్రిటన్ లో 50 వేల కరోనా కేసులు

50000 Corona Cases In Britain :

బ్రిటన్లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే 50.584 కేసులు నమోదయ్యాయి. డెల్టా వైరస్ ఈ విధంగా విస్తరిస్తుంటే మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇంగ్లాండ్ లో 22 కేసులు రాగా వేల్స్ లో ఐదు, స్కాట్లాండ్ లో ఓమిక్రాన్ కేసులు 29 వెలుగు చూశాయి. కేసులు ఎక్కువగా ఉన్నా మరణాలు తక్కువగా ఉండటం కొంతలో కొంత ఉరట. నిన్న ఒక్క రోజు 143 మంది చనిపోయారు.  50 వేల కేసులు వస్తున్నా మరణాలు గణనీయంగా తగ్గటం గమనార్హం.

ఓమిక్రాన్ కేసుల్లో ఎక్కువమంది వ్యాక్సిన్ తీసుకున్న వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 50 మంది ఓమిక్రాన్ బాధితుల్ని బ్రిటన్ వైద్యఆరోగ్య శాఖ పరీక్షించగా రెండు డోసుల టీకా వేసుకున్న వారికి 25 మందికి కొత్త  వెరియంట్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారితో ఎక్కువగా ఓమిక్రాన్ సంక్రమణ జరుగుతోంది.

Also Read :  దుబాయ్ వెళ్ళిన ఒమిక్రాన్ బాధితుడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్