Thursday, April 25, 2024
Homeసినిమా‘7 డేస్ 6 నైట్స్’ థియేట్రికల్‌ ట్రైల‌ర్‌కు మంచి స్పందన

‘7 డేస్ 6 నైట్స్’ థియేట్రికల్‌ ట్రైల‌ర్‌కు మంచి స్పందన

Trailer Out: ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇండస్ట్రీకి అందించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎంఎస్ రాజు, దర్శకునిగా ‘డర్టీ హరి’ విజయం తర్వాత రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘7 డేస్ 6 నైట్స్’కి రూపకల్పన చేశారు. సంక్రాంతి బరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ‘లెట్ మి గో దేర్’ సాంగ్ విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ట్రైలర్ కు అద్భుత స్పందన లభిస్తోంది. సినిమాపై అంచనాలు పెంచింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్టు ఎంఎస్ రాజు తెలిపారు. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ హీరో. ఆయన సరసన మెహర్ చాహల్ నటించారు. రోహన్, క్రితికా శెట్టి మరో జంటగా నటించారు. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్. ఎస్ నిర్మాతలు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందింది. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఒక రోడ్ ట్రిప్‌కు వెళ్లిన‌ ఇద్దరు యువకుల కథే ‘7 డేస్ 6 నైట్స్’. టైటిల్ చూసి హారర్ చిత్రమో, మరొకటో అనుకోవద్దు. ఇదొక కూల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. టూర్‌లో జ‌రిగిన‌ సంఘటనలను మా నాన్నగారైన దర్శకుడు ఎంఎస్ రాజు అందంగా చిత్రీకరించారు. ఇద్దరు యువకులుగా నేను, రోహన్ (తొలి పరిచయం) నటించాం. మెహర్ చాహల్, క్రితికా శెట్టిలను కథానాయికలుగా పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాలో వండర్ ఫుల్ విజువల్స్, రొమాన్స్ తో పాటు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ హైలైట్ అవుతాయి. నా కెరీర్‌లో ఈ సినిమాలోని క్యారెక్టర్ బెస్ట్ గా నిలుస్తుంది. నాతో పాటు తోటి నటీనటుల పాత్రలు హైలైట్ అవుతాయి” అని అన్నారు.

Also Read : కూల్ ఎంటర్‌టైనర్‌గా ఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’

RELATED ARTICLES

Most Popular

న్యూస్