Sunday, June 14, 2026
Homeసినిమా‘సర్కారు వారి పాట’ కళావతి.. సరికొత్త పోస్టర్ రిలీజ్

‘సర్కారు వారి పాట’ కళావతి.. సరికొత్త పోస్టర్ రిలీజ్

Kalavathi Poster: సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం చి మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి. ఆ పాత్ర పేరు మీదుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది.

ఇది ఖ‌చ్చితంగా మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. తమన్ స్వరపరిచిన ఈ పాటతో అందరూ ప్రేమలో పడనున్నారు. ఇది మహేష్ బాబు, కీర్తి సురేష్ మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని చూపుతుంది. మేకర్స్ ఈ చిత్రం నుండి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో మహేష్ బాబు నిజంగా ప్రిన్స్‌ గా కనిపిస్తున్నాడు.   కీర్తి సురేష్ మెరిసే చీరలో అందంగా ఉంది.

మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నఈ భారీ చిత్రం సర్కారు వారి పాట మే 12న వేసవి కానుక‌గా రానుంది.

ఇవి కూడా చదవండి: ఫిబ్రవరి 14న ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ విడుద‌ల‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular