వెస్టిండీస్ తో జరిగిన నాలుగో టి 20లో ఇండియా 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఫ్లోరిడాలోని లాడెర్’ హిల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఇండియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17 ఓవర్లలోనే ఛేదించింది.
తొలి మ్యాచ్ లో విఫలమైన యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో సత్తా చాటాడు. శుబ్ మన్ గిల్ తో కలిసి తొలి వికెట్ కు 165 పరుగుల రికార్డు భాగస్వామయం నెలకొల్పారు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ లతో 84 పరుగులు చేసి జైస్వాల్ నాటౌట్ గా నిలవగా, గిల్ 47 బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్సర్లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. తిలక్ వర్మ ఏడు పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
అంతకుముండు వెస్టిండీస్ జట్టులో హెట్మెయిర్ 39 బంతుల్లో 3 ఫ్లోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి రాణించాడు. షాయ్ హోప్ 45: బ్రాండన్ కింగ్ 18, కేల్ మేయర్స్ 17, ఓడియన్ స్మిత్ 15 పరుగులు చేశారు.
ఇండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, కులదీప్ యాదవ్ రెండు; అక్షర పటేల్, యజువేంద్ర చాహల్, ముఖేష్ కుమార్ తలా ఒక వికెట్ సాధించారు.
యశస్వి జైశ్వాల్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ 2-2తో సమం అయ్యింది. సిరీస్ విజేత నిర్ణయించే ఆఖరి మ్యాచ్ నేడు ఇదే మైదానంలో జరగనుంది