Monday, November 25, 2024
HomeTrending Newsటిబెట్లో చైనా అరాచకం

టిబెట్లో చైనా అరాచకం

టిబెట్ లో యువతను మిలిటరీ శిక్షణలో చేరాలని చైనా ఒత్తిడి చేయటం వివాదాస్పదంగా మారింది. స్కూల్ విద్యార్థులతో పాటు టిబెటన్ యువత కమ్యూనిస్ట్ ఆర్మీలో చేరాలని కొద్ది రోజులుగా చైనా పాలకులు ఒత్తిడి చేస్తున్నారు. మాట వినని వారిని నిర్భంద కేంద్రాలకు తరలిస్తున్నారు. విద్యార్థులు సెలవుల్లో భౌద్ధ మఠాల్లో టిబెటన్ సంప్రదాయాలు, ఆచారాలపై శిక్షణ తీసుకుంటారు. కొన్ని దశాబ్దాలుగా ఇది జరుగుతోంది. అయితే బౌద్ద మఠాలు చైనా వ్యతిరేక బావజాలం నేర్పిస్తున్నాయని ఆరోపిస్తూ ఇటీవల మిలిటరీ తో వాటిని కూల్చి వేయిస్తున్నారు. బౌద్ద సన్యాసుల్ని జైళ్లలో నిర్భందిస్తున్నారు.

 టిబెటన్ సంస్కృతిని దెబ్బ తీసేందుకే చైనా పాలకులు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని,  టిబెట్ లో చైనా విధానాలపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ తో పాటు యురోపియన్ దేశాలు టిబెటన్ల పట్ల చైనా పాలకులు శాంతియుతంగా, సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికాయి. లాసా, నిగిత్రి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మిలిటరీ క్యాంపులు ఎత్తివేయాలని సూచించాయి.

టిబెటన్లు, ఉయ్ఘర్ ముస్లింల విషయంలో చైనా కక్ష సాధింపు చర్యలపై తొందరలోనే అమెరికా, యురోపియన్ యూనియన్ దేశాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్