Sunday, June 7, 2026
HomeTrending Newsఓటమి భయంతోనే బాబు రెండు చోట్ల పోటీ : పెద్దిరెడ్డి

ఓటమి భయంతోనే బాబు రెండు చోట్ల పోటీ : పెద్దిరెడ్డి

కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమని అందుకే ఆయన రెండో చోట కూడా పోటీ చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో ఇక్కడ మెజార్టీ స్థానాలు తమ పార్టీయే గెల్చుకుందని, అందుకే అన్ని సర్వేల్లోనూ కుప్పంలో వైసీపీ విజయం సాధిస్తుందని వస్తోందని వివరించారు. ఒక వేల బాబు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే ఇక్కడ ఓటమిని అంగీకరించినట్లేనని పేర్కొన్నారు.

కుప్పం, హిందూపురంల్లో ప్రత్యేక వ్యూహాలు ఏమీ అమలు చేయడం లేదని, రాష్ట్రం యూనిట్ గానే తాము ఎన్నికల గెలుపు వ్యూహం ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ నియోజకవర్గాలు కాబట్టి ఇక్కడ విజయం సాధించి తీరాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు.  టిక్కెట్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని హిందూపురం అసెంబ్లీ, లోక్ సభ సీట్లు రెండూ  మహిళలకే ఇచ్చామని వెల్లడించారు. నాలుగు రోజులుగా హిందూపురంలో పర్యటిస్తున్న పెద్దిరెడ్డి నేడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక, ఎంపి అభ్యర్థి శ్రీమతి శాంత లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఇన్ ఛార్జ్ ల మార్పు తో కొంత గందరగోళం నెలకొన్న మాట వాస్తవమే అయినా త్వరలోనే అంటా సర్దుకుంటుందని, పెద్దగా అసంతృప్తి ఏమీ లేదని అన్నారు. టిడిపి తరఫున పోటీ చేసేందుకు అభ్యర్ధులు దొరకడం లేదన్నారు. జగన్ నాయకత్వంలో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే సులువుగా గెలుస్తామని ఉంటుందని అందుకే పోటీ నెలకొందని అన్నారు. మా దగ్గర టిక్కెట్లు రాని వారిని టిడిపిలోకి తీసుకుంటున్నారని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదని, వైఎస్ షర్మిల ఆ పార్టీలో చేరడం వల్ల తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని పెద్దిరెడ్డి తేల్చి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular