Sunday, May 26, 2024
HomeTrending Newsటిడిపిలోకి పార్థసారధి, జన సేన లోకి రాయుడు

టిడిపిలోకి పార్థసారధి, జన సేన లోకి రాయుడు

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆంధ్ర ప్రదేశ్ లో జంపింగ్ జపాంగ్ లు కూడా ఊపందుకుంటున్నాయి. విజయవాడ ఎంపి, టిడిపి నేత కేశినేని నాని వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. నానితో పాటు కొలుసు పార్థ సారధి, అంబటి రాయుడు, కర్నూలు ఎంపి సంజీవ్ కుమార్ కూడా పార్టీలు మారుతున్నారు. 

గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి కొలుసు పార్థసారధి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు వైసీపీ అధినాయకత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చంద్రబాబు నుంచి నూజివీడు టికెట్ హామీని ఇప్పటికే  సారథి పొందారని, 18న గుడివాడలో జరిగే తెలుగుదేశం సభలో ఆయన చేరబోతున్నారని తెలుస్తోంది

మరోవైపు ఇటీవలే వైసీపీలో చేరి పది రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి రాయుడు రేపో మాపో జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు.  గత ఐపీఎల్ సీజన్  ముగిసిన వెంటనే క్రికెట్ కు గుడ్ బై చెప్పి రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించిన అంబటి తొలి నుంచీ వైసీపీ వైపే మొగ్గు చూపి గుంటూరు నుంచి ఎంపిగా పోటీ చేయాలని భావించారు. ఈ మేరకు జగన్ తో పలుమార్లు సంప్రదింపులు కూడా జరిపారు. అయితే  అభ్యర్ధుల మార్పులు, చేర్పుల్లో భాగంగా గుంటూరు పార్లమెంట్ నుంచి నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు ను పోటీ చేయించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వచ్చిన వార్తలతో అంబటి తీవ్ర మనస్తాపం చెంది వెంటనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కాపు సామాజికవర్గానికి చెందిన రాయుడు జనసేన వైపు మొగ్గు చూపారు. కర్నూలు ఎంపి టికెట్ ను మంత్రి గుమ్మనూరు జయరాం కు కేటాయిస్తున్నట్లు  వచ్చిన సమాచారంతో సిట్టింగ్ వైసీపీ ఎంపి డా. సంజీవ్ కుమార్ పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

RELATED ARTICLES

Most Popular

న్యూస్