సెన్సిబుల్, క్యూట్ లవ్‌స్టోరీస్‌కు ప్రేక్షకాదరణ ఎప్పటికీ ఉంటుందని రీసెంట్గా మరోసారి ప్రూవ్ చేసిన చిత్రం `మెరిసే మెరిసే`. ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ మాధ్యమంలో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రముఖ డిజిటల్ ఛానెల్ అమెజాన్ ప్రైమ్‌లో `మెరిసే మెరిసే` సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్ కొత్తూరి మాట్లాడుతూ “కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో వచ్చిన మా సినిమా `మెరిసే మెరిసే` చిత్రాన్ని ప్రేక్షకులకు ఆదరించారు. సినిమా బావుందంటూ సమీక్షకులు కూడా ప్రశంసించారు. స్త్రీ సాధికారత అనే అంశాన్ని ప్రేమ కథకు ముడిపెట్టి వివరించిన తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో `మెరిసే మెరిసే` అందుబాటులోకి వచ్చింది. దినేష్ తేజ్, శ్వేతా అవస్థి సహా నటీనటుల పెర్ఫామెన్స్, లవ్ అండ్ ఎమోషనల్ పాయింట్స్.. ఈ జనరేషన్లో కెరీర్ పరంగా యూత్.. ముఖ్యంగా మహిళలు ఎలా ఆలోచిస్తున్నారనే పాయింట్‌ను కనెక్టింగ్‌గా చెప్పాం. తప్పకుండా సినిమాను చూసి అందరూ ఎంజాయ్ చేయండి” అన్నారు.