Sunday, November 3, 2024
Homeస్పోర్ట్స్Womens Asia Cup: యూఏఈపై విజయం -సెమీస్ కు చేరువైన ఇండియా

Womens Asia Cup: యూఏఈపై విజయం -సెమీస్ కు చేరువైన ఇండియా

మహిళల ఆసియా కప్ టి20లో ఇండియా వరుసగా రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి సెమీస్ కు చేరువైంది. మొదటి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ పై గెలుపొందిన ఇండియా నేడు జరిగిన మ్యాచ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై 78 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇండియన్ వికెట్ కీపర్ రిచా ఘోష్ 29 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 64 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి నాటౌట్ గా నిలిచింది.

దంబుల్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మొదలైన మ్యాచ్ లో టాస్ గెలిచిన యూఏఈ ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. 23 పరుగుల వద్ద ఓపెనర్ స్మృతి మందానా (13) ఔటయ్యింది. 52 రన్స్ వద్ద వరుసగా రెండు వికెట్లు (షఫాలీ వర్మ -37; హేమలత -2) కోల్పోయింది. కెప్టెన్ హార్మన్ ప్రీత్ – రోడ్రిగ్యూస్ లు నాలుగో వికెట్ కు 54 పఅరుగులు జోడించారు. రోడ్రిగ్యూస్ 14 పరుగులే చేసినా కెప్టెన్ కు అండగానిలిచింది. హర్మన్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 66 రన్స్ చేసి చివరి ఓవర్లో వెనుదిరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా 5 వికెట్లు కోల్పోయి 201  పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్ ఈశా ఓజా-38; కవిషా-40 రన్స్ తో ఫర్వాలేదనిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2, రేణుకా సింగ్, తనూజా, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

రిచా ఘోష్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్