ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల స్థితిగతులపై అమికస్ క్యూరీ నివేదిక. సుప్రీంకోర్టుకు రిపోర్టు అందించిన అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా. మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపీలు నిందితులుగా ఉన్నట్లు నివేదికలో వెల్లడి. మనీలాండరింగ్ కేసుల్లో 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 151 కేసులు పెండింగ్‍లో ఉన్నాయి. 58 పెండింగ్ కేసుల్లో జీవతఖైదు శిక్షలు విధించతగినవి కాగా 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదన్న అమికస్ క్యూరీ.
మానవ వనరుల కొరత ప్రధాన సమస్యగా ఉందని ప్రతి ఒక్కరూ సీబీఐ విచారణ కోరుతున్నారని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు.