Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంభారతియార్ కు గాంధీజీ ప్రశంస!

భారతియార్ కు గాంధీజీ ప్రశంస!

గాంధీజీ తమిళనాడుకి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య భారతియార్ ఆయనను మొదటిసారిగా కలుసుకున్న సంఘటన ఓ గొప్ప విషయమైంది. ఆయన భారతియార్ అన్న విషయం గాంధీజీకి తెలీని
రోజులవి. భారతియార్ తనను ఓ కవిగా గాంధీజీకి పరిచయం చేసుకున్నారు.

మద్రాసులోని తిరువల్లిక్కేణి సముద్రతీరాన ప్రతి శుక్రవారం తాను నిర్వహించే సమావేశానికి ఒక్కసారైనా హాజరైతే బాగుంటుందని గాంధీజీని కోరారు భారతియార్.

అయితే గాంధీజీ వెంటనే తన పక్కన ఉన్న మహదేవ్ దేశాయ్ తో అందుకు అవకాశముందా అని అడిగారు.

శుక్రవారం కుదరదని, మరుసటిరోజైతే వీలుంటుందని గాంధీజీ చెప్పారు.

భారతియార్ “మీకోసం శుక్రవారంనాటి మా సమావేశాన్ని వాయిదా వేయడం కుదరదు. అయినా మరుసటిరోజైనా వస్తానని చెప్పినందుకు ధన్యవాదాలు. మీ దేశసేవకు కవిగా నా శుభాకాంక్షలు” అన్నారు గాంధీజీతో ఏమాత్రం తొణకక బెణకక.

అనంతరం భారతియార్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

అప్పుడు అక్కడే ఉన్న రాజాజీతో గాంధీజీ “వచ్చివెళ్ళిన ఆ యువకుడు ఓ గొప్ప శక్తిగా ఎదుగుతాడు. నాకిందులో ఆవగింజంత అనుమానం లేదు. అతనిని కొనియాడి సంరక్షించుకోవడం మీ బాధ్యత” అని చెప్పారు.

ఈ సంఘటన 1920నాటిది.

అప్పట్లోనే భారతియార్ ని ఓ సాటి లేని మేటి కవిగా గుర్తించిన గాంధీజీ అభిప్రాయం తర్వాతికాలంలో అక్షరాలా నిజమైంది.

సుబ్రహ్మణ్య భారతియార్ తిరుగులేని గొప్ప జాతీయకవిగా తమిళ సాహిత్య పుటలకెక్కడం విశేషం.

ఇప్పటికీ ఎప్పటికీ భారతియార్ తమిళులకు విశిష్ట జాతీయ కవే.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్